![Minister Mahmood Ali About Group 1 Mains In Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/12/MAHMOOD-ALI-3.jpg.webp?itok=W17UX1Iq)
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న శాసనసభ సభ్యుల సూచనను పరిశీలించి టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదిస్తామని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం బిల్లులపై చర్చలో ఆయన మాట్లాడారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశంపై ఆయన స్పందిస్తూ గ్రూప్–1 మెయిన్స్‌కు 1:50 నిçష్పత్తిలో టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసిందని వివరించారు. నిష్పత్తిలో మార్పులు చేసి 1:100గా ఎంపిక చేయాలన్న సభ్యుల సూచనను పరిశీలించి టీఎస్‌పీఎస్సీకి సూచిస్తామని తెలిపారు. కొత్త స్టేషన్ల ఏర్పాటు, కొత్త భవనాలపై సభ్యులు సూచనలు చేయగా..చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment