కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగం పంచుకుంటామని, పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశం సిద్ధమని సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ సాద్ మహమ్మద్ అల్సతి వెల్లడించారు.హైదరాబాద్ కేంద్రంగా సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సౌదీ రాయబారికి సీఎం సూచించారు. 3 లక్షల మందికిపైగా తెలంగాణవాసులు సౌదీలో నివసిస్తున్నారని, గత హైదరాబాద్ సంస్థాన పరిధిలోని ఇతర ప్రాంతాల వారూ పెద్ద సంఖ్యలో సౌదీలోనే ఉన్నారన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వారంతా రాకపోకలు సాగిస్తున్నందున హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై స్పందించిన అల్సతి...ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సౌదీలో తెలంగాణవాసులు ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలను తక్షణమే స్వరాష్ట్రానికి తరలించేందుకు సహకరించాలని సీఎం కోరారు