
24 ఎకరాల భూమి హాంఫట్
- బీబీనగర్ మండలం రాఘవాపురంలో అక్రమ రిజిస్ట్రేషన్
- విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన బాధితుడు దీపక్
- 21 మంది నిందితుల్లో 15 మంది అరెస్టు, పరారీలో ఆరుగురు
- అరెస్ట్ అరుునవారిలో నయీమ్ కేసు నిందితుడు గోలి పింగలిరెడ్డి
- వివరాలను వెల్లడించిన రాచకొండ పోలీస్ కమిషనర్ భగవత్
చౌటుప్పల్: బీబీనగర్ మండలం రాఘవాపు రంలో ఓ ఎన్నారైకి చెందిన రూ.8.40కోట్ల విలువ చేసే 24 ఎకరాల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారం గుట్టు రట్టరుుంది. ఈ కేసుకు సంబంధించి 21 మంది నిందితుల్లో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులోని ప్రధాన నిందితుడు గోలి పింగలిరెడ్డి కూడా ఉన్నాడు. శనివారం రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన ఎన్నారై దీపక్ కాంత్ వ్యాస్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురంలో 24 ఎకరాల భూమి ఉంది. అమెరికాలోని సెరుుంట్ లూరుుస్ ప్రాంతంలో నివాసం ఉండే ఈ ఎన్నారై అమెరికా- తెలం గాణ సంబంధాల విషయంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. భూమి విషయం ఎవరికీ తెలి యకపోవడం, యజమానిని ఎవరూ గుర్తు పట్టే అవకాశం లేకపోవడంతో ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు అక్రమ మార్గాలకు తెరలేపారు.
అన్నీ పక్కాగానే..
ఈ కేసులో ప్రధాన పాత్రధారి అరుున కొర్ని మహేశ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కావాల్సిన రికార్డులను తయారీ చేరుుంచాడు. భూ యజమాని దీపక్‌కాంత్ వ్యాస్‌కు చెందిన నకిలీ ఆధార్‌కార్డు, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయంలో రికార్డుల మార్పిడి, నకిలీ పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్‌ల తయారు చేరుుంచాడు. నకిలీ పత్రాల ద్వారా ఎన్నారై స్థానంలో భూ యజమానిగా మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన జితేందర్‌కుమార్ బండారి జైనును రంగంలోకి దింపారు. అంతా ఓకే అనుకున్నాకా బీబీ నగర్‌కు చెందిన పింగళిరెడ్డి, మల్లారెడ్డి కలసి భూమిని రిజిస్ట్రేషన్ చేరుుంచుకునేందుకు హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన జిల్లెల రవీందర్‌రెడ్డి, మల్లిపెద్ది అరవింద్‌రెడ్డిని రంగంలోకి దించారు. అందరూ కలసి అనుకున్న మేరకు 2016 మే 13న భూమిని రిజిస్ట్రేషన్ చేరుుంచుకున్నారు.
చక్రం తిప్పిన డాక్యుమెంట్ రైటర్
భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు బీబీనగర్‌లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉన్నప్పటికీ, విషయం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో తమ పాత పరిచయాలతో చౌటుప్పల్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ శ్రవణ్‌ను సంప్రదించి రూ. లక్షకు బేరం కుదుర్చుకున్నాడు.రూ.70 వేలు రిజిస్ట్రార్‌కు ఇచ్చి తను రూ.30 వేలు తీసుకున్నాడు. వెంటనే తతంగాన్ని సజావుగా పూర్తి చేరుుంచాడు.
సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎన్నారై
తనకు జరిగిన అన్యాయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఎన్నారై దీపక్ కాంత్ వ్యాస్ ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేసీఆర్.. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సూచించారు. దీంతో ఆయన పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కేసును త్వరగా ఛేదించాలని ఆదేశించారు.
అరెస్టరుున నిందితులు వీరే..
కొర్ని మహేష్ (రాఘవాపురం, బీబీనగర్ మండలం), బుయ్య సాంబయ్య (రాఘవాపురం, బీబీనగర్ మండలం), ముద్దోజు బాలాచారి (గుర్ల్ర దండి, బీబీనగర్ మండలం), బిజిలి యాదగిరి (రాఘవాపురం, బీబీనగర్ మండలం), సోనుమంకార్ శంకర్ (బాల్‌నగర్, రంగారెడ్డి జిల్లా), జితేందర్ కుమార్ బండారి జైన్ (కమలానగర్, గడ్డిఅన్నారం), బుయ్య బసవరాజు (రాఘవపురం, బీబీనగర్), తీగల నర్సింగ్ (సంజయ్‌పురి కాలనీ, జగద్గిరిగుట్ట), పంజాల పెంటయ్య (దమ్మారుుగూడెం, బీబీనగర్ మండలం), సారుునోజు వేణు గోపాలచారి (బాల్‌నగర్, రంగారెడ్డి జిల్లా), నాయకుని శ్రీను (పంచశిలకాలనీ, కుత్బు ల్లాపూర్), బాణోతు లక్ష్మణ్, (టీచర్స్ కాలనీ, భువనగిరి), కొమ్మిడి మల్లారెడ్డి, (హబ్సిగూడ, హైదరాబాద్), గోలి పింగళిరెడ్డి (మన్సూ రాబాద్, ఎల్‌బీనగర్), చింతకింది ప్రశాంత్ (శ్రీనివాస్‌నగర్ కాలనీ, జగద్గిరిగుట్ట).