
సాక్షి, హైదరాబాద్: నగరం లోని కామాటిపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలికపై జరిగిన లైంగిక దాడి గురించి హోంమంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. నింది తులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, ప్రత్యేక బృం దం ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని నగర కమిషనర్ అంజనీకుమార్‌ను సోమవారం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల రక్షణ చర్యలు చేపడుతోందన్నారు. బాధితురాలికి వైద్యసహాయం అందించాలని, ఎలాంటి సహాయ సహకారాలు అవసరమున్నా వేగంగా స్పందించాలని కమిషనర్‌కు హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.