
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడ్డ జిల్లాలను కుదించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలకు సైతం శంకుస్థాపన చేసిన దృష్ట్యా, కొత్త జిల్లాల కుదింపు సమస్యే లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న 31 జిల్లాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
జిల్లాలను కుదిస్తారంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. శుక్రవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే 92 శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తయిందని తెలిపారు. మొత్తం 568 మండలాల్లోని 10,806 గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభించగా, 10,443 గ్రామాల్లో పూర్తయిందని వెల్లడించారు. ఇప్పటివరకు 2,13,18,724 ఎకరాల భూరికార్డులు పరిశీలించి 1,97,10,172 ఎకరాల రికార్డులను సవరించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment