సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.
తెలంగాణ జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇటీవలే నాంపల్లిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వీరికి మధ్యంతర బెయిల్ పొడిగించలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. దీంతో, భుజంగరావు.. హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌పై పిటిషన్లు దాఖలు చేయడంతో నేడు విచారణ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment