Bhujanga Rao
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.తెలంగాణ జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇటీవలే నాంపల్లిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వీరికి మధ్యంతర బెయిల్ పొడిగించలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. దీంతో, భుజంగరావు.. హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌పై పిటిషన్లు దాఖలు చేయడంతో నేడు విచారణ జరుగనుంది. -
ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్తున్న వేళ.. ఈ కేసులో నిందితుడు భుజంగరావుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు.. రేపు(గురువారం) సాయంత్రం. 4గం. లోపు జైలుకు వెళ్లాలని భుజంగరావును ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ2 నిందితుడు. అనారోగ్య కారణాల రిత్యా ఈ ఏడాది ఆగష్టు 19వ తేదీన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దానిని పొడగిస్తూ వచ్చింది. అయితే కిందటి నెలలో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు దానిని తిరస్కరించింది. అదే టైంలో మధ్యంతర బెయిల్ విషయంలో మరికొంత ఊరట ఇచ్చింది.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై మరో కేసు నమోదైంది. కూకట్పల్లి ఏసీపీగా పనిచేసిన రోజుల్లో అక్కడ 340 ఎకరాల భూకబ్జాకు సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. ఇన్నాళ్లు భయంతో మిన్నకుండిపోయి న బాధితుడు మీర్ అబ్బాస్ అలీఖాన్ ధైర్యం చేసి సైబరాబాద్ పోలీస్‌కమిషనర్ అవినాష్ మహంతికి తాజాగా ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లిలోని సర్వే నంబరు 1007లో ఉన్న 340 ఎకరాల భూమి అబ్బాస్‌అలీఖాన్ తండ్రి నవాబ్ మీర్ హషిమ్ అలీఖాన్‌కు వారసత్వంగా వచి్చంది.దీనిపై కొందరు కుటుంబీకుల మధ్య సివిల్ సూట్ నడుస్తోంది. కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన అంశాల్లో పట్టులేని హషిమ్ వీటి కోసం ఎస్ఎస్.మొయినుద్దీన్, యాసీన్ షేక్ సహకారం తీసుకున్నాడు. దీనిని వారు తమకు అనుకూలంగా మార్చుకొని, ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించారు. ఇది తెలిసీ హషిమ్.. వీరిద్దరిపై కేపీహెచ్‌బీ ఠాణాలో 2014 మేలో ఫిర్యాదు చేశారు. దీంతో యాసీన్ కూకట్పల్లి ఏసీపీగా ఉన్న నాయిని భుజంగరావును సంప్రదించి భారీ మొత్తం ఆఫర్ చేశాడు. దీంతో కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ హషిమ్అలీని భుజంగరావు వేధించడంతో పాటు తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేయించారు.ఈ క్రమంలోనే గ్రీన్కో కంపెనీ నిర్వాహకులు సీహెచ్.అనిల్, శ్రీనివాసరావు.. యాసీన్, మొయినుద్దీన్‌తో కలిసి ఆ భూమి కాజేయడానికి ముందుకొచ్చారు. భుజంగరావు సలహా మేరకు వీరంతా గూండాలను పంపి హషిమ్ను కిడ్నాప్ చేసి నిర్బంధించి, భూమికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోపక్క ఈ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేయనివ్వకుండా భుజంగరావు దర్యాప్తు అధికారిపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిణామాలు, వేధింపులు భరించలేకపోయిన హషిమ్ తీవ్ర అనారోగ్యానికి గురై 2020 జూన్ 30న కన్నుమూశారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో భుజంగరావు అరెస్టు కావడంతో ధైర్యంచేసి బయటికొచి్చన అబ్బాస్ అలీఖాన్ ఆయనపై ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం కేసు నమోదు చేసుకున్న ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో A2 భుజంగరావుకు ఊరట
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ2 నిందితుడు భుజంగరావుకు ఊరట లభించింది. అనారోగ్య కారణాల రిత్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి క్రిమినల్ కోర్టు.ఫోన్ టాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావును మార్చి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి మిగతా నిందితులతో పాటు ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజులపాటు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు ఆదేశాలిచ్చింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లకూడదనే షరతు విధించింది. ఈ కేసులో మొదట అరెస్ట్ అయ్యింది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పంజాగుట్ట పోలీసులు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుల్ని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రధాన సూత్రధారి, ఏ1 ప్రభాకర్‌రావు అమెరికాలో ఉండగా.. ఆయన కోసం ఈ మధ్యే రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు చుక్కెదురు
-
ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీ కోరిన పోలీసులు
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించించారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం, ఈరోజు ఉదయమే వారిద్దరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, పంజాగుట్ట పోలీసులు వీరిని చంచల్గూడా జైలుకు తరలిస్తున్నారు. ఇక, విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్‌రావు నైజిరియాలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటే విచారణకు రావాలని గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం భావిస్తోంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం: ఇద్దరు అదనపు ఎస్పీలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రే వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇక, విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. విచారణకు రావాలని గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం భావిస్తోంది. ఫోన్లతో మొదలుపెట్టి.. నిఘా విభాగాలు జాతీయ భద్రతతోపాటు రాజద్రోహం తదితర అంశాలపైనా కన్నేసి ఉంచడానికి ట్యాపింగ్ చేస్తుంటాయి. అలా నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగు లోకి వచ్చినట్టు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసర మైన ఫోన్లను ట్యాప్ చేసింది. ఉప ఎన్నికల వేళ ట్యాపింగ్.. దీనివల్ల జరుగుతున్న లాభాలు తెలిసిన రాజకీయ నాయకులు వీలైనన్ని నంబర్లను అక్రమంగా ట్యాప్ చేసేలా ప్రేరేపించారు. దీనికోసం విదేశాల నుంచి పరికరాలు, సాఫ్ట్వేర్లు అక్రమంగా దిగుమతి అయ్యాయి. 2018 ఎన్నికల నాటి నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్ మీడియాను ట్యాప్ చేయడం మొద లెట్టారు. దీనికోసం టెక్నా లజీ కన్సల్టెంట్ రవి పాల్ సహకారంతో ఇజ్రాయిల్ నుంచి పెగాసిస్ తరహా సాఫ్ట్వేర్ తెప్పించుకుని విని యోగించినట్టు సమాచారం. ‘ట్యాపింగ్’ ఆధారంగా వసూళ్లు! కొన్నాళ్లుగా ప్రభాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ రాజకీయ నాయకుడు కలసి బెదిరింపుల దందాకు దిగారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు, బిల్డర్లు, ఇన్ఫ్రా కంపెనీల యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారు. దీనికోసం హైదరాబాద్‌లోని పర్వతగిరి, వరంగల్, సిరిసిల్లలోనూ వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్‌రావు, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్‌లలో పనిచేసిన ఇద్దరు అధికారులు, మరికొందరు బృందంతో కలసి ఆ ట్యాపింగ్స్‌లోని అంశాలను విశ్లేషించేవారు. కీలక అంశాలను పట్టుకుని.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక విభాగాల్లో పనిచేసే కొందరి దృష్టికి తీసుకువెళ్లేవారు. వారు సదరు రాజకీయ నాయకుడితోపాటు ప్రభాకర్‌రావు నుంచి క్లియరెన్స్ తీసుకుని.. సదరు టార్గెట్ల నుంచి వీలైనంత వరకు వసూళ్లు చేసేవారు. అప్పట్లో ఈ మూడు ప్రత్యేక విభాగాలకు నేతృత్వం వహించిన అధికారులు.. నాటి ప్రభుత్వంతోపాటు ప్రభాకర్‌రావుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని సమాచారం. కొన్ని వసూళ్ల వ్యవహారాలను ఓ ఎంపీ, ఎమ్మెల్సీ సూచనలతోనూ కొనసాగించినట్టు సమాచారం. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. రేపు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పర్చునున్నారు. ప్రణీత్ రావును, భుజంగరావును శనివారం పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ పోలీసులు.. భుజంగరావు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. రేపు( ఆదివారం) మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎస్ఐబీలో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్‌ను పిలిచి విచారించారు. మరోవైపు ఎస్ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎస్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భుజంగరావు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ సంఘం తరపున బి.భుజంగరావును ఎంపిక చేసినట్టు రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) అధ్యక్షుడు జి.సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.పర్వత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సంఘం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. -
రైల్వేలను నిర్వీర్యం చేయొద్దు
సంఘ్ డివిజన్ కార్యదర్శి భుజంగరావు కాజీపేటలో గ్రీవెన్స మేళా కాజీపేట రూరల్ : కేంద్రప్రభుత్వం రైల్వే శాఖ ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని, ఈ ప్రయత్నాలను మానుకోవాలని సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ కార్యదర్శి భుజంగరావు డిమాండ్ చేశారు. కాజీపేట జంక్షన్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో శుక్రవారం రైల్వే కార్మికుల గ్రీవెన్స్ మేళా జరిగింది. ఈ మేళాకు రైల్వే యంత్రాంగం సికింద్రాబాద్ పర్సనల్ విభా గం నుంచి అదనపు పర్సనల్ ఆఫీసర్ అల్తాఫ్ హుస్సేన్, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్లు వి.జ్ఞానయ్య, రాంనాథ్ వచ్చారు. ఈ సందర్భంగా హాజరైన భుజంగరావు మాట్లాడుతూ సేవా రంగమైన రైల్వే శాఖ ఎప్పటికీ పేద, మ ధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉందన్నారు. 2004 తర్వాత వచ్చే కార్మికులకు పెన్షన్ పథకం వర్తించాలని, హై లెవల్ రీస్ట్రక్షరింగ్ కమిటీ సిఫార్సులను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. పీఎన్ఎం సమావేశంతో... కాజీపేటలోని కార్మికుల సమస్యలపై పీఎన్ఎం మీటింగ్‌లో ప్రస్తావించగా ఇక్కడ గ్రీవెన్స మేళా నిర్వహించేందుకు డీఆర్ఎం మిశ్రా, సీనియర్ డీపీఓ కుసుమాకర్ పాండే అంగీకరించారని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ అధ్యక్షుడు అతుల్‌భట్టాచార్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘ్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఐఎస్ఆర్.మూర్తి మాట్లాడుతూ గ్రీవెన్స్ మేళాలో 157 మంది కార్మికులు అందజేసిన ఫిర్యాదులను నమోదు చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ్ బాధ్యులు డి.నర్సయ్చ, ఎస్.వెంకటేశ్వర్లు, డి.రాజ్‌కుమార్, వి.రఘునాథ్, జీవీ.పాల్, మురళి, అగ్గి రవీందర్, ఏఎస్ఆర్.ప్రసాద్, కె.సమ్మయ్య, జి.భాస్కర్, ఎ.శ్రీనివాస్‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు.