రైల్వేలను నిర్వీర్యం చేయొద్దు
సంఘ్ డివిజన్ కార్యదర్శి భుజంగరావు
కాజీపేటలో గ్రీవెన్‌స మేళా
కాజీపేట రూరల్ : కేంద్రప్రభుత్వం రైల్వే శాఖ ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని, ఈ ప్రయత్నాలను మానుకోవాలని సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ కార్యదర్శి భుజంగరావు డిమాండ్ చేశారు. కాజీపేట జంక్షన్‌లోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో శుక్రవారం రైల్వే కార్మికుల గ్రీవెన్స్ మేళా జరిగింది. ఈ మేళాకు రైల్వే యంత్రాంగం సికింద్రాబాద్ పర్సనల్ విభా గం నుంచి అదనపు పర్సనల్ ఆఫీసర్ అల్తాఫ్ హుస్సేన్, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్లు వి.జ్ఞానయ్య, రాంనాథ్ వచ్చారు. ఈ సందర్భంగా హాజరైన భుజంగరావు మాట్లాడుతూ సేవా రంగమైన రైల్వే శాఖ ఎప్పటికీ పేద, మ ధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉందన్నారు. 2004 తర్వాత వచ్చే కార్మికులకు పెన్షన్ పథకం వర్తించాలని, హై లెవల్ రీస్ట్రక్షరింగ్ కమిటీ సిఫార్సులను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.
పీఎన్‌ఎం సమావేశంతో...
కాజీపేటలోని కార్మికుల సమస్యలపై పీఎన్‌ఎం మీటింగ్‌లో ప్రస్తావించగా ఇక్కడ గ్రీవెన్‌స మేళా నిర్వహించేందుకు డీఆర్‌ఎం మిశ్రా, సీనియర్ డీపీఓ కుసుమాకర్ పాండే అంగీకరించారని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ అధ్యక్షుడు అతుల్‌భట్టాచార్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సంఘ్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఐఎస్‌ఆర్.మూర్తి మాట్లాడుతూ గ్రీవెన్స్ మేళాలో 157 మంది కార్మికులు అందజేసిన ఫిర్యాదులను నమోదు చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ్ బాధ్యులు డి.నర్సయ్చ, ఎస్.వెంకటేశ్వర్లు, డి.రాజ్‌కుమార్, వి.రఘునాథ్, జీవీ.పాల్, మురళి, అగ్గి రవీందర్, ఏఎస్‌ఆర్.ప్రసాద్, కె.సమ్మయ్య, జి.భాస్కర్, ఎ.శ్రీనివాస్‌తో పాటు కార్మికులు పాల్గొన్నారు.