సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు వెనక్కి పంపించింది.
ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి పంపించింది. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగ రావ్, తిరుపతన్నలు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి 90 రోజులు గడిచినా ఛార్జ్‌షీట్ వేయలేదు కాబట్టి తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇక, వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై నేడు కోర్టులో విచారణ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment