ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్‌ | Telangana Phone Tapping Accused Parbhakar Rao Petition To US Govt | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్‌

Published Fri, Nov 29 2024 12:37 PM | Last Updated on Fri, Nov 29 2024 2:59 PM

Telangana Phone Tapping Accused Parbhakar Rao Petition To US Govt

సాక్షి,హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు తెలంగాణ  ప్రభుత్వానికి షాకిచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు తాజాగా పిటిషన్ పెట్టుకున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్‌లో ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని తెలిపారు. రాజకీయంగా తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నానని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.

ప్రస్తుతం తాను ఫ్లోరిడాలోని కుమారుని వద్ద ఉంటున్నానని తెలిపారు.కాగా,మరో వైపు అమెరికాలో తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.ఈ కేసులో మరో నిందితుడు, టీవీఛానల్ ఎండి శ్రవణ్ రావు అమెరికాలోని చికాగోలో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. 

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement