ఇది తెలంగాణ ప్రగతికి సంకేతం | TS clocks highest power demand of 10,429 mw | Sakshi
Sakshi News home page

ఇది తెలంగాణ ప్రగతికి సంకేతం

Published Wed, Aug 1 2018 7:15 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం కొత్త రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 7.33 గంటల సమయంలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ 10,429 మెగావాట్లకు ఎగబాకి గత మార్చి 8న నమోదైన 10,284 మెగావాట్ల పాత రికార్డును చెరిపేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. దీనిపై మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్‌ సౌధలో మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో పెరిగిపోవడం రాష్ట్ర అభివృద్ధికి సూచిక అని అభివర్ణించారు. విద్యుత్‌ డిమాండ్‌ 12,500 మెగావాట్లకు పెరిగిన సరఫరా చేసేందుకు విద్యుత్‌ సంస్థలు సంసిద్ధతతో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పిన ప్రతిమాట నిజమవుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ 6,660 మెగావాట్లు మాత్రమే ఉన్నా, అప్పట్లో అవసరాలకు సరిపడా విద్యుత్‌ లేక కోతలు విధించాల్సి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే కోతలను అధిగమించామని చెప్పారు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement