ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు టీమ్‌లో పనిచేసిన అధికారులను ప్రశ్నించిన సిట్
కీలక సమాచారం సేకరించినట్టు చెప్తున్న అధికార వర్గాలు
ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు మాజీ ఓఎస్డీలు అమెరికాకు పరారీ
వారి నివాసాలు సహా 10 ప్రాంతాల్లో సిట్ అధికారుల సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ వ్యవహారం కేసులో సిట్ వేగం పెంచింది. ఎస్‌ఐబీకి చీఫ్‌గా వ్యవహరించిన ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు బృందంలో పనిచేసిన మరి కొందరు అధికారులను శుక్ర, శనివారాల్లో ప్ర శ్నించింది. అదనపు ఎస్పీ తిరుపతన్న శనివా రం సిట్ ఎదుట హాజరుకాగా.. మరో అదనపు ఎస్పీ భుజంగ్‌రావును అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైద రాబా ద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతా ల్లో ఈ వ్యవహారంతో సంబంధమున్న వారి నివాసాల్లో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి.
ఫోన్లతో మొదలుపెట్టి..
నిఘా విభాగాలు జాతీయ భద్రతతోపాటు రాజద్రోహం తదితర అంశాలపైనా కన్నేసి ఉంచడానికి ట్యాపింగ్ చేస్తుంటాయి. అలా నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగు లోకి వచ్చినట్టు సమాచారం. అయితే ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్ల లో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసర మైన ఫోన్లను ట్యాప్ చేసింది.
దీనివల్ల ఒనగూ రుతున్న లాభాలు తెలిసిన రాజకీయ నాయకు లు వీలైనన్ని నంబర్లను అక్రమంగా ట్యాప్ చే సేలా ప్రేరేపించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్‌వేర్లు అక్రమంగా దిగుమతి అయ్యాయి. 2018 ఎన్నికల నాటి నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేప థ్యంలో ఫోన్లతోపాటు సోషల్ మీడియాను ట్యాప్ చేయడం మొద లెట్టారు. దీనికోసం టెక్నా లజీ కన్సల్టెంట్ రవి పాల్ సహకారంతో ఇజ్రాయిల్ నుంచి పెగాసిస్ తరహా సా ఫ్ట్‌వేర్ తెప్పించుకుని విని యోగించినట్టు సమాచారం.
‘ట్యాపింగ్’ ఆధారంగా వసూళ్లు!
కొన్నాళ్లుగా ప్రభాకర్‌రావుతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ రాజకీయ నాయ కుడు కలసి బెదిరింపుల దందాకు దిగారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు, బిల్డర్లు, ఇన్‌ఫ్రా కంపెనీల యజమానుల ఫోన్లను ట్యాప్ చేశారు. దీనికోసం హైదరాబాద్‌లోని పర్వతగిరి, వరంగల్, సిరిసిల్లలోనూ వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్‌రావు, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్‌లలో పనిచేసిన ఇద్దరు అధికారులు, మరికొందరు బృందంతో కలసి ఆ ట్యాపింగ్స్‌లోని అంశాలను విశ్లేషించేవారు. కీలక అంశాలను పట్టుకుని.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ప్రత్యేక విభాగాల్లో పనిచేసే కొందరి దృష్టికి తీసుకువెళ్లేవారు.
వారు సదరు రాజకీయ నాయకుడితోపాటు ప్రభాకర్‌రావు నుంచి క్లియరెన్స్ తీసుకుని.. సదరు టార్గెట్ల నుంచి వీలైనంత వరకు వసూళ్లు చేసేవారు. అప్పట్లో ఈ మూడు ప్రత్యేక విభాగాలకు నేతృత్వం వహించిన అధికారులు.. నాటి ప్రభుత్వంతోపాటు ప్రభాకర్‌రావుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నవారేనని సమాచారం. కొన్ని వసూళ్ల వ్యవహారాలను ఓ ఎంపీ, ఎమ్మెల్సీ సూచనలతోనూ కొనసాగించినట్టు సమాచారం.
అమెరికా వెళ్లిపోయిన ఆ ఇద్దరు..: డీఎస్పీ ప్రణీత్‌రావుపై సస్పెన్షన్ వేటు పడగానే ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు దేశం దాటేశారు. ఈ వ్యవహారంపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదై, ప్రణీత్‌రావును అరెస్టు చేశాక హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఫార్మా కంపెనీ నిర్వహించే తమ సన్నిహితుడి వద్ద ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం.
విచారణలో కీలక అంశాలు..
సిట్ అధికారులు శుక్ర, శనివారాల్లో అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగ్‌రావులను విచారించారు. ప్రభాకర్‌రావు హయాంలో తిరుపతన్న ఎస్‌ఐబీలో, భుజంగ్‌రావు సాధారణ ఇంటెలిజెన్స్‌లో పొలిటికల్ వింగ్‌ను పర్యవేక్షించారు. వీరి నుంచి సిట్ అధికారులకు ట్యాపింగ్‌కు సంబంధించి కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. ఇక ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావుతోపాటు అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఇతరుల నివాసాలు కలిపి మొత్తం 10 చోట్ల సిట్ అధికారులు శనివారం సోదాలు చేశారు.
నాలుగైదు నెలల ముందు నుంచే డేటా ధ్వంసం
నిందితుడు ప్రణీత్‌రావు, అనుమానితుల వి చారణ, సేకరించిన ఆధారాలన్నింటినీ విశ్లే షించినా ప్రభాకర్‌రావు బృందం ఎందరి ఫో న్లను ట్యాప్ చేసిందనేది చెప్పలేకపోతున్నా మని సిట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. రాజ కీయ అవసరాలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కోసం ఎస్‌ఐబీ కేంద్రంగా ఫోన్ల ట్యా పింగ్ జరిగిందని.. ఆ డేటాను కొందరు ప్రైవే ట్ వ్యక్తులకూ కాపీ చేసి ఇచ్చారని తెలుస్తోందని తెలిపారు. ప్రణీత్‌రావు తదిత రులు గత ఏడాది సెప్టెంబర్–అక్టోబర్ నుంచే డేటాను ధ్వంసం చేయడం మొదలెట్టా రని.. డిసెంబర్ 4 రాత్రి హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం అందులో భాగమేనని సమాచారం. హార్డ్‌డిస్క్‌లతో పాటు హ్యాకింగ్ ఉపకరణాలు, సాఫ్ట్‌వేర్లనూ ధ్వంసం చేశారా? అనేది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment