
నామినేషన్ పత్రాన్ని సమర్పిస్తున్న ప్రభాకర్‌రావు. చిత్రంలో తలసాని, దానం తదితరులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఎస్ ప్రభాకర్‌రావు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ అద్వైత్‌కుమార్‌కు అందజేశారు. మొదటి సెట్‌పత్రాలను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు గద్వాల్ విజయలక్ష్మి, మమతాగుప్తాలతో కలసి దాఖలు చేశారు.
రెండోసెట్ నామినేషన్ పత్రాలను ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, మాజీమేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్ మహ్మద్ నజీరుద్దీన్‌లతో కలసి దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ఈ నెల 5 చివరి తేదీ కాగా 6న పరిశీలన, 8న ఉపసంహరణ, అవసరమైన పక్షంలో 22న పోలింగ్ జరుగుతుంది. ఠీనియోజకవర్గంలో ఇద్దరు లోక్‌సభ సభ్యులు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు, 14 మంది ఎమ్మెల్సీలు, 16 మంది ఎమ్మెల్యేలు, జిల్లా పరిధిలోని 84 మంది కార్పొరేటర్లు, 8 మంది కంటోన్మెంట్ బోర్డు సభ్యులు వెరసి మొత్తం 129 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.