రాబోయే సాధారణ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ‘అధికార’ ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు కావాల్సిన ఎస్‌ఐలకు తమ పరిధిలో పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారు.
సాక్షి, న ల్లగొండ: రాబోయే సాధారణ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ‘అధికార’ ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు కావాల్సిన ఎస్‌ఐలకు తమ పరిధిలో పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారు. పది రోజుల్లోనే ఒక్కో ఎస్‌ఐని మూడు పోలీసుస్టేషన్లు మార్చడం పలు అనుమానాలకు తావి స్తోంది. ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశాల మేరకు ఆయా స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలను జిల్లా ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు బదిలీ చేశారు. గతనెల 28న, ఈ నెల 5న, తాజాగా శుక్రవారం మూడు దఫాలుగా ఎస్‌ఐలకు స్థాన చలనం కల్పించారు.
అయితే మొదటి విడతగా పోస్టింగ్ పొందిన ఎస్‌ఐలను.. మరో రెండు స్టేషన్లకు మార్చుతూ వచ్చారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి తమ పరిధిలో, విధుల పట్ల కొంచెం నిక్కచ్చిగా వ్యవహరించిన వారికి అప్రధాన విభాగాల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇందుకోసం జిల్లాకు చెందిన అధికార నేతలు జిల్లా పోలీసు యంత్రాంగంపై ఒత్తిడి చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే పరిపాలనా సౌలభ్యం కోసమే తాము ఎస్‌ఐలను రెండు స్టేషన్లకు మార్చామని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.