‘విద్యుత్‌’ సీఎండీల పదవీకాలం పొడిగింపు  | Tenure Extensions to Power Companies CMDs | Sakshi
Sakshi News home page

‘విద్యుత్‌’ సీఎండీల పదవీకాలం పొడిగింపు 

Published Thu, May 30 2019 2:36 AM | Last Updated on Thu, May 30 2019 2:36 AM

Tenure Extensions to Power Companies CMDs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) సీఎండీ ఎ.గోపాల్‌రావు, టీఎస్‌ రెడ్కో వైస్‌ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.జానయ్యతో పాటు మరో 21 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా బుధవారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు వారంతా తమ పదవుల్లో కొనసాగుతారని పేర్కొన్నారు.

ప్రభాకర్‌రావు పదవీకాలం వచ్చేనెల 4న ముగియనుండగా.. మిగిలిన సీఎండీలు, డైరెక్టర్ల పదవీకాలం ఈ నెల 31తో పూర్తికానుండటంతో ప్రభుత్వం వారి పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జెన్‌కో డైరెక్టర్లు పీహెచ్‌ వెంకటరాజం (హైడల్‌), ఎం.సచ్చిదానందం (ప్రాజెక్ట్స్‌), ఎ.అశోక్‌కుమార్‌ (హెచ్‌ఆర్‌), బి.లక్ష్మయ్య (థర్మల్‌), ఎ.అజయ్‌ (సివిల్‌), ట్రాన్స్‌కో డైరెక్టర్లు జి.నర్సింగ్‌రావు (ప్రాజెక్ట్స్‌), టి.జగత్‌రెడ్డి(ట్రాన్స్‌మిషన్‌), జె.సూర్యప్రకాశ్‌ (ఎత్తిపోతల), బి.నర్సింగ్‌రావు (గ్రిడ్‌ ఆపరేషన్‌), టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ డైరెక్టర్లు జె.శ్రీనివాస్‌ రెడ్డి (ఆపరేషన్స్‌), టి.శ్రీనివాస్‌ (ప్రాజెక్ట్స్‌), కె.రాములు (కమర్షియల్‌), జి.పర్వతం (హెచ్‌ఆర్‌), సీహెచ్‌ మదన్‌మోహన్‌రావు (పీఅండ్‌ఎంఎం), ఎస్‌.స్వామిరెడ్డి (ఐపీసీ), టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్లు బి.వెంకటేశ్వరరావు (హెచ్‌ఆర్‌), పి.మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్‌), పి.సంధ్యారాణి (కమర్షియల్‌), పి.గణపతి (ఐపీసీ, పీఏసీ), డి.నర్సింగ్‌రావు (ఆపరేషన్స్‌) పదవీకాలం పొడిగింపు పొందిన వారిలో ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement