అటవీ ఉద్యోగం కత్తిమీద సామే
మంచిర్యాల అర్బన్ : అటవీ ఉద్యోగం కత్తి మీద సాము లాం టిదని మంచిర్యాల డీఎఫ్‌వో డాక్టర్ ప్రభాకర్‌రావు అన్నారు. బుధవారం స్థానిక డీఎఫ్‌వో కార్యాలయం ఆవరణలోని సమావేశం మంది రంలో ట్రైనీ బీట్ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అటవీ ఉద్యోగం సవాళ్లతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. అడవిలో క్రూర మృగాలు ఒకవైపు స్మగ్లర్లు మరోవైపు ఉంటారని తె లిపారు. ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అంకితభావం, క్రమశిక్షణ ఉద్యోగులకు అలంకారం లాంటివని ఈ సందర్భంగా ఆయన గు ర్తుచేశారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 50 మంది ట్రైనీ బీట్ ఆఫీసర్లు, దూలపల్లి అకాడమీకి చెందిన డెప్యూటీ డెరైక్టర్ సాగర్, డెప్యూటీ డీఎఫ్‌వో తిరుమల్‌రావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అప్పయ్య, డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, బీట్ ఆఫీసర్ రేపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ముగిసిన అధ్యయన యాత్ర
ట్రైనీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల జిల్లా అడవుల అధ్యయన యాత్ర బుధవారం ముగిసింది. వారం రోజుల పాటు జిల్లాలోని అడవుల అందాలను, జంతువులను ఆనందంగా వీక్షించారు. హైదరాబాద్‌లోని దూలపల్లి అటవీ శాఖ అకాడమీలో శిక్షణ పొందుతున్న 50 మంది ట్రైనీ బీట్ ఆఫీసర్లు వారం రోజుల క్రితం జిల్లాకు వచ్చారు. పశ్చిమ జిల్లాలోని అడవులను అధ్యయనం చేశారు. బుధవారం మంచిర్యాలకు వచ్చారు. ఇక్కడ తునికాకు టెండర్ల ప్రక్రియ, సేకరణ, గోదాముల్లో నిల్వ గురించి డీఎఫ్‌వో ప్రభాకర్‌రావు, ఎఫ్‌ఆర్వో అప్పయ్య వివరిం చారు. అనంతరం శ్రీరాంపూర్‌లోని సింగరేణి యాజమాన్యం నాటిన మొక్కలను, జైపూర్ మండలంలోని భీమారం నర్సరీని సంద ర్శిం చారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు వెళ్లారు.
చట్టాలపై అవగాహన ఉండాలి
జన్నారం : చట్టాలపై అవగాహన ఉంటే పెట్టే కేసులో సక్సెస్ అవుతామని, మరోసారి స్మగ్లిం గ్ జరుగకుండా జాగ్రత్త పడవచ్చని డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జన్నారం అటవీ శాఖ అథితి గృహం వద్ద ట్రైనీ బీట్ అధికారులకు పలు సూచనలిచ్చారు.