హైదరాబద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ కార్యాలయానికి ప్రగతి భవన్ నుంచి లేఖ వెళ్లింది. ప్రమాణస్వీకారానికి సమయం ఇవ్వాలని గవర్నర్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విజ్ఞప్తి వచ్చింది. అయితే సీఎంవో లేఖపై రాజ్ భవన్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గవర్నర్ ఆఫీస్ నుంచి షెడ్యూల్ రాగానే కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.
ఈటల స్థానంలో పట్నం
ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు క్యాబినెట్ విస్తరణను ఒకరికే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో 18మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం 17 మంది మంత్రులు ఉన్నారు. ఖాళీగా ఉన్న ఈటల స్థానంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక వేళ గంపా గోవర్ధన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే.. ప్రస్తుతమున్న వారిలో ఒకరిని పక్కనపెట్టే అవకాశముంది.
పాండిచ్చేరి నుంచి హైదరాబాద్
నిన్న పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసైకు మంత్రి వర్గ విస్తరణ గురించి సమాచారం అందించడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. అదే సమాచారాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు గవర్నర్.
Reached Hyderabad in the afternoon for engagements in Telangana today and tomorrow
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 21, 2023
ఇది కూడా చదవండి: మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
Comments
Please login to add a commentAdd a comment