
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం బాగోలేదని ఆయన భార్య సునితా కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తుందని పేర్కొన్నారు. సీఎంను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ప్రజలు దీనికి తగిన సమాధానం ఇస్తారని అన్నారు. రౌస్ అవన్యూ కోర్టు ప్రాంగణంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. తొలుత మార్చి 28వ తేదీ వరకు రిమాండ్‌కు పంపారు. నేటితో(మార్చి 28) ఆయన కస్టడీ ముగియడంతో.. ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం కేజ్రీవాల్‌కు మరో నాలుగు రోజుల కస్టడీ విధించి రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో ఆయన్ను ఏప్రిల్ 1 వరకు ఈడీ విచారించనుంది.
చదవండి: శివసేనలో చేరిన నటుడు గోవిందా.. ముంబై నార్త్ వెస్ట్ నుంచి పోటీ?
Comments
Please login to add a commentAdd a comment