పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య కన్నుమూత | Former Bengal chief minister Buddhadeb Bhattacharjee passes away | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య కన్నుమూత

Published Thu, Aug 8 2024 11:02 AM | Last Updated on Thu, Aug 8 2024 1:18 PM

Former Bengal chief minister Buddhadeb Bhattacharjee passes away

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ భట్టాచార్య (80) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమేరకు సీపీఎం స్టేట్ సెక్రటరీ మహమ్మద్ సలీం వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన .. కొద్ది సేపటి క్రితమే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2౦౦౦ నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భట్టాచార్యకు భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు.

భట్టాచార్య మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ‘భట్టాచార్య దశాబ్దాలుగా తెలుసు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న బట్టాచార్యను పలు మార్లు ఇంటికి వెళ్లి పరామర్శించాను. కానీ గురువారం ఆయన మరణ వార్త తెలిసింది. వారి కుటుంబసభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement