న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. తమకు మద్దతిస్తే మంత్రిపదవులు, ఆస్తులు, రూ. 20 కోట్ల వరకు నగదు ఇస్తామంటూ బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలను కొన్ని రోజులుగా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ వినతిపత్రంలో ఆరోపించారు.
ఆ ప్రలోభాలకు లొంగకపోవడంతో చంపేస్తామంటూ తమ ఎమ్మెల్యే వందన కుమారిని హెచ్చరించారన్నారు. నెలరోజుల్లోనే మోడీ ప్రభుత్వంపై ప్రజల ఆశలు ఆవిరయ్యాయని, ఆ విషయం అర్థమైన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓటమి ఖాయమని భావించి, అడ్డదారుల్లో అధికారంలోకి రావాలనుకుంటోందని పేర్కొన్నారు.
రాష్ట్రపతిని కలిసిన కేజ్రీవాల్
Published Thu, Jul 3 2014 11:18 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
Advertisement
Advertisement