అరవింద్ కేజ్రివాల్ కు ఎదురుదెబ్బ | Janlokpal bill stalled in Delhi Assembly | Sakshi
Sakshi News home page

అరవింద్ కేజ్రివాల్ కు ఎదురుదెబ్బ

Published Fri, Feb 14 2014 6:13 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

అరవింద్ కేజ్రివాల్ కు ఎదురుదెబ్బ

అరవింద్ కేజ్రివాల్ కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో జన్ లోక్ పాల్ బిల్లుపై శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది.  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రవేశపెట్టిన జన్ లోక్ పాల్ బిల్లు అసెంబ్లీలో తిరస్కారానికి గురైంది. దాంతో  సీఎం కేజ్రీ వాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
 
బిల్లు ప్రవేశపెట్టడానికి జరిపిన ఓటింగ్ లో అనుకూలంగా 27 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. బిల్లు తిరస్కారానికి గురికావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. 
 
దాంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి వీల్లేదని ప్రకటించిన స్పీకర్ ప్రకటించారు.  సాధారణ ఎజెండా ప్రకారం సభ కొనసాగుతోంది. ప్రస్తుతం బడ్జెట్‌పై ఢిల్లీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement