ఢిల్లీ అసెంబ్లీలో జనలోక్ పాల్ బిల్లు
Published Fri, Feb 14 2014 4:21 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
న్యూఢిల్లీ: తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను శుక్రవారం మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సలహాను బేఖాతరు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బిల్లును అసెంబ్లీలో చర్చకు పెట్టారు. 'సభలో బిల్లును ప్రవేశపెట్టాం. బిల్లుపై సానుకూల చర్చ జరుగుతుంది' అని సభ వాయిదా పడిన తర్వాత న్యాయశాఖ మంత్రి సోమ్ నాత్ భారతి మీడియాకు వెల్లడించారు.
సభలో బిల్లు ప్రవేశపెట్టగానే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు స్పీకర్ ఎంస్ ధీర్ ను చుట్టుముట్టడంతో గందరగోళం నెలకొంది. దాంతో సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. అవినీతిని తుదముట్టేంచేందుకు జన లోక్ పాల్ బిల్లును తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం పట్టుపడుతున్న సంగతి తెలిసిందే.
Advertisement