
అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభలో ఈ సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన బలం నిరూపించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిన విషయం తెలిసిందే.
బిజెపి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 37 మంది సభ్యుల మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఆప్కు చెందిన 28 సభ్యులు, కాంగ్రెస్కు చెందిన 8, ఒక జెడియు సభ్యుడు మద్దతు పలికారు.