17 నుంచి కమలనాథుల ప్రచారం షురూ
Published Sat, Sep 14 2013 11:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
విధానసభ ఎన్నికలకు కమలదళం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. గెలుపే లక్ష్యం అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెట్టిన బీజేపీ అగ్రనాయకత్వం, ఇక క్షేత్రస్థాయిలో వాటి అమలుపై దృష్టి సారించనుంది. ప్రత్యర్థిపార్టీకి ఒక అడుగు ముం దుంటూ వస్తున్న బీజేపీ నాయకులు ఈనెల 17న తాల్‌కటోరా స్టేడియంలో నిర్వహించనున్న భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నుట్ట ప్రక టించారు. శనివారం బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజ య్‌గోయల్, విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్ర పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలతోపా టు యువతకు చేరువయ్యేం దుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వారు ప్రత్యేకంగా చర్చించారు.
17న నిర్వహించనున్న ఎన్నికల ప్రచార ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అసెం బ్లీ ఎన్నికల ఇన్‌చార్జి నితిన్ గడ్కరీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరా జ్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ, జాతీ య ప్రధాన కార్యదర్శి అమిత్‌షా, అనంత్‌కుమార్ తదితరులు పాల్గొననున్నట్టు విజయ్‌గోయల్ తెలి పారు. ‘బీజేపీ ఎన్నికల ప్రచారంలో విద్యుత్, నీటి బిల్లులు, కాంగ్రెస్‌పార్టీ నాయకుల అవినీతి, కుంభకోణాలు, అనధికారిక కాలనీలు, జేజే కాలనీలు, నిరుద్యోగం, గ్రామీణ ప్రాం తాల అభివృద్ధి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తాం. ఇందుకు సంబంధించి ఓ బుక్‌లెట్‌ను త్వరలోనే విడుదల చేయనున్నామ’ని గోయల్ పేర్కొన్నారు.
ఇంటింటికీ ప్రచారం...
పార్టీ శ్రేణులంతా గ డప గడపకు తిరిగి ప్రచారం నిర్వహిస్తాయని గోయల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతోపాటు ప్రజ లకు దీనిపై అవగాహన కల్పించేదుకు యత్నిస్తున్నట్టు వివరించారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగ ట్టడంతోపాటు ప్రత్యేకించి పేద మధ్యతరగతి, యువతకు చేరవయ్యేలా కార్యచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. అనధికారిక కాలనీలు, జేజే కాలనీలు, మురికి వాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
మెడీపై గోయల్ ప్రశంసల జల్లు...
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని మంత్రిగా చేయాలని యువత కోరుకుంటోందని విజయ్‌గోయల్ అన్నారు. నరేంద్రమోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడం పార్టీకి మరింత బలాన్ని పెంచిందంటూ ఆయన ప్రశంసల జల్లు కురిపించారు గోయల్. 14ఏళ్లలో మోడీ నాయకత్వంలో గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందిందని, అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ సర్కార్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై గెలుపు సాధించేందుకు మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన అంశమూ లాభం చేస్తుందని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 29న రోహిణిలోని జపనీస్ పార్క్ ప్రాంతంలో నిర్వహించనున్న ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగిస్తారని తె లిపారు. ర్యాలీకి దాదాపు 5 లక్షల మంది హారవుతారని ఆశిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధిచిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్టు వివరించారు.
Advertisement
Advertisement