మాజీ ఎమ్మెల్యే జయమంగళపై కేసు నమోదు | case filed on ex mla | Sakshi

మాజీ ఎమ్మెల్యే జయమంగళపై కేసు నమోదు

Aug 3 2016 10:08 PM | Updated on Jul 11 2019 8:35 PM

మాజీ ఎమ్మెల్యే జయమంగళపై కేసు నమోదు - Sakshi

మాజీ ఎమ్మెల్యే జయమంగళపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జయమంగళ వెంకటరమణ, మరో ఇద్దరిపై కైకలూరు టౌన్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 31న ఆలపాడు చెక్‌పోస్టు వద్ద చేపల చెరువుకు తూములతో వెళుతున్న ట్రాక్టరు, డ్రైవర్‌ను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని కైకలూరు ఫార్టెస్ట్‌ ఆఫీసుకు తరలించారు.

కైకలూరు : 
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జయమంగళ వెంకటరమణ, మరో ఇద్దరిపై కైకలూరు టౌన్‌ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత నెల 31న ఆలపాడు చెక్‌పోస్టు వద్ద చేపల చెరువుకు తూములతో వెళుతున్న ట్రాక్టరు, డ్రైవర్‌ను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని కైకలూరు ఫార్టెస్ట్‌ ఆఫీసుకు తరలించారు. ఈ నెల ఒకటో తేదీన జయమంగళ వెంకటరమణ, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు సంఘ ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజు, కొట్టాడ సర్పంచ్‌ మైలా నరసింహస్వామి, మరో 60 మంది గ్రామస్తులు కలసి ట్రాక్టరు, డ్రైవర్‌ను బలవంతంగా విడిపించుకుపోయారు. ఆ సమయంలో ఫారెస్ట్‌ కార్యాలయంలో ఉన్న సిబ్బంది జె.అంజీ, టి.సురేష్‌బాబు, ఎస్‌.కుమార్‌ను దుర్భాషలాడారు. ఈ ఘటనపై అదేరోజు డీఆర్వో ఈశ్వరరావు తమ విధులకు ఆటంకం కలిగించారని టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై జయమంగళ వెంకటరమణతోపాటు, బలే ఏసు, మైలా నరసింహస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement