నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన సమయాన్ని మించి పబ్‌ను నడుపుతున్న వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
బంజారాహిల్స్: నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన సమయాన్ని మించి పబ్‌ను నడుపుతున్న వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు పబ్‌లపై తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 37లో ఉన్న 36 డ్రైవ్‌ఇన్ పబ్ అర్ధరాత్రి వ్యాపారం చేయడమే కాకుండా పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఇంకా తెరిచిఉన్నట్లు తేలడంతో ఈ పబ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.