
న్యూఢిల్లీ: లోక్‌పాల్ నియామకానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపుతూ 10 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. లోక్‌పాల్‌ను నియమించాలని గత ఏప్రిల్‌లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం అమలు చేయలేదని పేర్కొంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేంద్రం లోక్‌పాల్‌ను నియమించే వరకు సుప్రీం తన అధికారంతో ఆర్టికల్ 142 ప్రకారం లోక్‌పాల్‌ను నియమించాలని కామన్ కాజ్ తరఫు సీనియర్ లాయరు శాంతి భూషణ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment