హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరి | sujana choudary filed a pitition in High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరి

Published Tue, Apr 12 2016 3:31 AM | Last Updated on Tue, Oct 2 2018 3:56 PM

హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరి - Sakshi

హైకోర్టును ఆశ్రయించిన సుజనా చౌదరి

సాక్షి, హైదరాబాద్: మారిషస్ బ్యాంక్ రుణం కేసులో కేంద్రమంత్రి సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రుణం చెల్లింపు వ్యవహారంలో మారిషస్ బ్యాంక్ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టేయాలని అభ్యర్థించారు.

మారిషస్ బ్యాంక్ తనపై దురుద్దేశాలతో కేసు పెట్టిందని పేర్కొన్నారు. రాజకీయ నాయకుడిగా, మంత్రిగా తన ప్రతిష్టను దెబ్బతియ్యాలన్న ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టిందని సుజనా చౌదరి ఆరోపించారు. కేసుల ద్వారా పరోక్షంగా తనపై ఒత్తిడి తెచ్చి వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే ఆ బ్యాంకు ఆలోచన అని పేర్కొన్నారు. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న హేస్టియా లిమిటెడ్ మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకుందని, సుజనా యూనివర్సల్‌లో తాను కేవలం నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌ను మాత్రమేనని వివరించారు. ఆ కంపెనీ రోజువారీ వ్యవహారాలతో తనకు ఎంతమాత్రం సంబంధం లేదన్నారు.

అధికారిక కార్యక్రమాలు, ముందస్తు షెడ్యూళ్ల వల్ల కోర్టు విచారణకు హాజరు కాలేకపోతున్నానని, అందువల్ల మినహాయింపునివ్వాలని కోరినా కింది కోర్టు పట్టించుకోలేదన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement