
కౌంటర్లు దాఖలు చేయండి
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ఏర్పాటును, కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటును సవాలు చేస్తూ హుస్నాబాద్ న్యాయవాదుల సంఘం కార్యదర్శి, మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ కోరుట్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.