రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్కు పిటిషన్ అందజేశారు. మొత్తం 11 పేజీల పిటిషన్ను స్పీకర్ నాదెండ్ల మనోహర్కు వైఎస్ విజయమ్మ అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే ఏర్పడే నష్టాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పిటిషన్లో వివరించింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ... రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్కు పిటిషన్ ఇచ్చిన మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.