జలుమూరు : సాక్షరభారత్ మండల కోర్డినేటర్ బొంగు ఎర్రయ్యపై కిడ్నాప్ కేసు నమోదైంది. లింగాలవలస పంచాయతీ హరికృష్ణమ్మపేటకు చెందిన మైనర్ బాలికను గత నెల 30న ఎర్రయ్య కిడ్నాప్ చేసినట్టు బాలిక తండ్రి మొజ్జాడ కసవయ్య పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. తన బిడ్డకు మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లి కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎర్రయ్య చల్లవానిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. కిడ్నాప్‌పై ఎస్‌ఐను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని కేసు నమోదు చేశామని చెప్పారు.
సాక్షరభారత్ కోఆర్డినేటర్‌పై కిడ్నాప్ కేసు
Published Fri, Jun 3 2016 10:32 AM | Last Updated on Tue, Oct 2 2018 3:56 PM
Advertisement
Advertisement