పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ అడ్వొకే ట్ జేఏసీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ‘దొరగారి బూట్లు నాకు పో’ అని వ్యాఖ్యలు చేసి, దళిత జాతిని అవమానపర్చారని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ సభ్యులు శనివారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నల్లాల ఒదెలును ఉద్దేశపూర్వకంగానే రేవంత్‌రెడ్డి కించపరిచారని, ఈ వాఖ్యలు దళిత జాతిని అవమానపర్చడమేనని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ సభ్యులు సి.హెచ్. ఉపేంద్ర, గోవర్ధన్‌రెడ్డి, కొమరయ్య, బ్రహ్మానందరెడ్డి, కె.ఎస్.కృష్ణ తదితరులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
Published Sun, Nov 30 2014 6:05 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM
Advertisement
Advertisement