ప్రొఫెసర్‌ను కులం పేరుతో దూషించడంపై కేసు | professor files Atrocity case in chilkalaguda police station | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ను కులం పేరుతో దూషించడంపై కేసు

Published Fri, Apr 1 2016 9:43 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM

professor files Atrocity case in chilkalaguda police station

చిలుకలగూడ (హైదరాబాద్): ఓ ప్రొఫెసర్‌ను కులం పేరుతో దూషించి దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్.కృష్ణయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ బ్రాహ్మణబస్తీలోని సాయిలోక్‌పూజ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆపార్ట్‌మెంట్ వద్ద పిల్లలు ఆడుకునే సమయంలో ఫ్రొఫెసర్ కృష్ణయ్యకు మరికొంత మంది మధ్య వివాదం జరిగింది.

దీంతో కొంతమంది కులం పేరుతో దూషిస్తూ మూకుమ్మడిగా దాడిచేసి కృష్ణయ్యను గాయపర్చారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సాయి (21), విజయ (31)లపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement