వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు | sc,st atrocity case on individual | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు

Published Sun, Aug 14 2016 8:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

sc,st atrocity case on  individual

ఓ మహిళనుకులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్‌కు చెందిన బానోతు పద్మ (32) నగరంలోని తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్‌లో స్టోర్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఇక్కడే రవాణా విభాగంలో పనిచేసే గజానన్ కొన్ని రోజుల క్రితం పద్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని పద్మ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా గజానన్‌ను పనిలో నుంచి తొలగించారు. ఇది మనసులో పెట్టుకున్న గజానన్ ఈ నెల 13వ తేదీన మద్యం సేవించి పద్మ ఇంటికి వచ్చి బెదిరించి కులం పేరుతో దూషించాడు. దీంతో బాధితురాలు ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు గజానన్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement