హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గుర్ని పంజగుట్ట పోలీసులు అరెస్టుచేశారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం ... అమీర్‌పేట శాలివాహనానగర్ లోని నిర్మల నిలయం మూడవ అంతస్థులో ఓ ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నరన్న పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.
నిర్వాహకురాలు కూకట్‌పల్లికి చెందిన సంధ్య(30) తోపాటు జీడిమెట్లకు చెందిన ఇద్దరు యువతులను అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యభిచార ముఠా గుట్టురట్టు
Published Mon, Jul 13 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement
Advertisement