
సాక్షి, హైదరాబాద్: ఓ అజ్ఞాత వ్యక్తి మాయ మాటలకు ‘రాహు’ సినిమా హీరోయిన్ కృతి గార్గ్ మోసపోయినట్టు తెలిసింది. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా చేయాలని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పేరుతో ఓ వ్యక్తి ఆమెను నమ్మించాడట. స్టోరీ వినడానికి ముంబైకి రమ్మని కృతిని ఆహ్వానించాడట. దాంతో అతని మాటలు నమ్మి ఆమె ముంబై బయలుదేరి వెళ్లారని.. అయితే, ముంబై వెళ్లిన కృతి ఫోన్ నెంబర్ సోమవారం ఉదయం నుంచి కలవడం లేదని ‘రాహు’ దర్శకుడు సుబ్బు వేదుల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(చదవండి: ‘రాహు’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment