
సెక్స్ వర్కర్ల దాడి.. కానిస్టేబుల్‌కు గాయాలు
పంజగుట్ట: కానిస్టేబుల్‌పై సెక్స్ వర్కర్లు రాళ్లతో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే .. సికింద్రాబాద్‌కు చెందిన కుక్కమల్ల కిషోర్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి నిమ్స్ సమీపంలోని బస్టాప్‌లో నిలబడి ఉండగా, అక్కడికి వచ్చిన ఇద్దరు సెక్స్ వర్కర్లు బలవంతంగా ఇతని జేబులో ఉన్న రూ.1200 నగదు లాక్కున్నారు. దీనిపై బాధితుడు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం క్రైమ్ కానిస్టేబుల్ వాల్ధాసు కిషోర్‌ను ఘటనా స్థలానికి పంపించారు.
విచారణ చేస్తుండగా ఫలక్‌నామా, ఒట్టెపల్లికి చెందిన షాహీన్, పర్వీన్ అనే సెక్స్ వర్కర్లు ఆటోడ్రైవర్ పాషాతో కలిసి కానిస్టేబుల్‌పై రాళ్లతో దాడి చేశారు. తీవ్ర గాయపడిన కిషోర్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు షాహీన్, పర్వీన్‌లను అదుపులోకి తీసుకోగా, పాషా పరారయ్యాడు. బాధితుడిని సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.