ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రముఖుల సంతాపం
బనశంకరి: ప్రముఖ యాంకర్, నటి, బుల్లితెర కళాకారిణి అపర్ణ (58) గురువారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్ది కాలంగా ఆమె శ్వాసకోశక్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. విద్యుత్ శ్మఽశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అపర్ణ భర్త నాగరాజ్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
అంతకు ముందు సీనియర్ నటుడు దొడ్డణ్ణ, రమేశ్‌భట్, రాఘవేంద్రరాజ్‌కుమార్, సుధారాణి, సుందర్‌రాజ్, తారా అనురాధ, చంద్రు, గిరిధర్ లోకేశ్, దర్శకుడు నారాయణ్, కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మహేశ్‌జోషి, వాటాళ్ నాగరాజ్‌తో పాటు సాహితీవేత్తలు అపర్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, కేంద్రమంత్రి హెచ్‌డీ.కుమారస్వామి, సినీ నటులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment