ప్రముఖ టీవీ యాంకర్, నటి రష్మి గౌతమ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. ఇటీవల తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనపై ఆమె ట్వీట్ చేసింది. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టిచంపారు. అయితే పేరేంట్స్ తీరును రష్మి తప్పుపట్టింది. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా, బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందించారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మిక చెబుతోంది అంటూ కామెంట్ చేశాడు. దీనికి రష్మి సైతం బదులిచ్చింది.
రష్మి గౌతమ్ తన ట్వీట్‌లో రాస్తూ..' ఆ చిన్నారిని ఎందుకలా ఒంటరిగా వదిలేశారు. కుక్క దాడి చేస్తుంటే తల్లిదండ్రులు నిద్ర పోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించి వెయ్యి వీడియోలను షేర్ చేయగలను. అసలు పిల్లల జీవితాలను రిస్క్‌లో పెట్టింది ఎవరు? జంతువుల విషయానికొస్తే అన్నీ లాజిక్స్ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి.. మీరు మాత్రం ప్రశాంతతను పొందాలనుకుంటే అది జరిగే పని కాదని' రిప్లై ఇచ్చింది.
అయితే దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ..' మీకు బుర్ర లేదని అర్థమైందండి.. ఈ మాట అంటున్నందుకు సారీ' అని రాసుకొచ్చాడు. దీనికి రష్మి బదులిస్తూ..'మీకు బుర్ర ఉంది కదా.. పిల్లలను కనడం మాత్రమే కాదు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను అలా వదిలేయకండి' అని సూచించింది. తల్లిదండ్రులు ఇలాంటి చిన్నచిన్న తప్పులు చేయకుండా ఉండాలని రష్మి హితవు పలికింది. అలాగే బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెంపుడు జంతులకు యజమానులే తగిన శిక్షణ ఇవ్వాలని.. దాడి జరిగితే ఆ పెంపుడు జంతువు యజమానిపైనా కేసు పెట్టాలని రష్మి అన్నారు.
I would have preferred responsible parents https://t.co/bgm2C3JRbJ
— rashmi gautam (@rashmigautam27) May 14, 2024
The article is about a toddler
And yes in this day and age of child rapes and molesters
Yes the child shud be 24* 7 monitored
The chances of your child getting molested by a human is higher than getting bitten by an animal https://t.co/e0Qq8TK4m1— rashmi gautam (@rashmigautam27) May 14, 2024
Comments
Please login to add a commentAdd a comment