సాయి పేరెంటరల్స్‌ ఐపీవో నేడు | Sai Parenterals Limited is launching a Rs 409 crore IPO on 24 March 2026 | Sakshi
Sakshi News home page

సాయి పేరెంటరల్స్‌ ఐపీవో నేడు

Mar 24 2026 4:04 AM | Updated on Mar 24 2026 8:53 AM

Sai Parenterals Limited is launching a Rs 409 crore IPO on 24 March 2026

ధరల శ్రేణి రూ. 372-392

రూ. 123 కోట్ల యాంకర్‌ నిధులు

హైదరాబాద్‌: ఫార్మాస్యూటికల్‌ రంగ కంపెనీ సాయి పేరెంటరల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు(24న) ప్రారభమై శుక్రవారం(27న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 372-392కాగా.. తద్వారా రూ. 409 కోట్లవరకూ సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు తాజాగా షేర్లను కేటాయించింది. ఒక్కో షేరుకీ రూ. 392 ధరలో 31,28,485 షేర్లు విక్రయించింది. తద్వారా దాదాపు రూ. 123 కోట్లు సమీకరించింది. యాంకర్‌ ఇన్వెస్టర్లలో కొటక్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఫండ్‌, క్వాంట్‌ ఎంఎఫ్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఏషియా(సింగపూర్‌) పీటీఈ, ఇండియా ఎమర్జింగ్‌ జెయింట్స్‌ ఫండ్‌ ఉన్నాయి. 

దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌సహా.. బీమా కంపెనీలు, తదితర విభిన్న సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు యాంకర్‌ పెట్టుబడుల జాబితాలో చేరినట్లు కంపెనీ వెల్లడించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 38 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్‌ 2కల్లా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానుంది. యాంకర్‌ పెట్టుబడులు.. కంపెనీ బిజినెస్‌ మోడల్‌, వృద్ధి అవకాశాలు, నిర్వహణా సామర్థ్యాలపట్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు సాయి పేరెంటరల్స్‌ ఎండీ అనిల్‌ కుమార్‌ కె. పేర్కొన్నారు. 

కంపెనీ ప్రధానంగా ఇంజెక్టబుల్‌ ప్రొడక్టులను తయారు చేస్తోంది. బ్రాండెడ్‌ జనరిక్స్‌తోపాటు.. కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌, తయారీ(సీడీఎంవో) సర్వీసులు సైతం అందిస్తోంది. కార్డియోవాస్కులర్‌, యాంటీబయోటిక్స్‌, డయాబెటిస్‌ తదితర వివిధ థెరప్యూటిక్‌ విభాగాలలో ఇంజెక్టబుల్స్‌, ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్‌ తదితర డోసేజీలు రూపొందిస్తోంది.

ఇదీ చదవండి: భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement