సోలోకు ముగ్గురు ఛాయాగ్రాహకులు
తమిళసినిమా: ఇప్పుడు సినిమాను ఆషామాషీగా తీస్తే ప్రేక్షకులు చూడడం లేదు. ఏదో కొత్తదనం కావాలి. అదీ ఆకర్షణీయంగా ఉంటేనే ప్రేక్షకదేవుళ్లు ఆదరిస్తారు. అలాంటి ఒక కొత్త ప్రయోగంతో సోలో అనే చిత్రం తెరకెక్కుతోంది. తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఇం దులో మాలీవుడ్ యువ నటుడు దుల్కర్‌సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
కార్పొరేట్ సంస్థ రెఫెక్స్ గ్రూప్ అధినేత అనిల్ జెయిన్ చిత్రనిర్మాణరంగంలోకి ప్రవేశించి గేట్ అవే ఫిలింస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర దర్శకుడు బి జాయ్ నంబియార్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహిస్తున్న తొలి తమిళ చిత్రం సోలోనేనన్నా రు.
ఇంతకు ముందు డేవిడ్ అనే చిత్రాన్ని చేసినా అది హిందీ చిత్రం అని, తమిళంలో అనువాద చిత్రమేనని చెప్పారు. కాగా సోలో చిత్రం తమిళం, మలయాళ భాషల్లో నేరుగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. చిత్ర కథానాయకుడు దుల్కర్‌సల్మాన్ మాట్లాడుతూ తనకిప్పటి వరకూ మంచి దర్శకులే అమిరారని, అందుకే మంచి చిత్రాలను అందించగలుగుతున్నానని పేర్కొన్నారు. తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో చేస్తున్న ఈ చిత్రం 8 చిత్రాల్లో నటించినందుకు సమా నం అని పేర్కొన్నారు.
తమిళంలో తన మూడు చిత్రా ల కార్యక్రమాల్లోనూ దర్శకుడు మణిరత్నం పాల్గొన్నారని, ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. దర్శకుడు మణిరత్నం మా ట్లాడుతూ ఇక్కడ తాను చూసిన సోలో చిత్ర ట్రైలర్ తనను చాలా ఆకట్టుకుందన్నారు. ఈ చిత్రానికి ముగ్గు రు ఛాయాగ్రాహకులు, 11 మంది సంగీతదర్శకులు పనిచేస్తున్నారట. ఇందులో ఒక్కో వెర్షన్‌కు 15 పాటల చొప్పున మొత్తం రెండు భాషలకు కలిపి 30 పాటలు చోటు చేసుకుంటాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి.