యాక్షన్‌కింగ్‌కు అర్ధాంగిగా.. | Arjun's wife in expert in the film nibunan is a good experience | Sakshi
Sakshi News home page

యాక్షన్‌కింగ్‌కు అర్ధాంగిగా..

Published Sat, Aug 5 2017 1:01 AM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

యాక్షన్‌కింగ్‌కు అర్ధాంగిగా..

యాక్షన్‌కింగ్‌కు అర్ధాంగిగా..

తమిళసినిమా: యాక్షన్‌కింగ్‌ అర్జున్‌కు అర్ధాంగిగా నిపుణన్‌ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది నటి శ్రుతిహరిహరన్‌. అర్జున్, ప్రసన్న, వరలక్ష్మీశరత్‌కుమార్, శ్రుతిహాసన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం నిపుణన్‌. అరుణ్‌వైద్యనాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతవారం తెరపైకి వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సందర్భంగా ఇందులో అర్జున్‌కు జంటగా నటించిన నటి శ్రుతిహరిహరన్‌ తన సంతోషాన్ని పంచుకుంటూ చిత్రం విజయం సాధిస్తే అందులో నటించిన తారలకు, సాంకేతిక వర్గానికి మంచి పేరుతో పాటు, మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. అలా  ప్రేక్షకుల ఆదరణను పొందుతున్న నిపుణన్‌ చిత్రంలో నటిస్తూ తానూ ఒక భాగం కావడం ఆనందంగా ఉందని అంది. ఇందులో అర్జున్‌కు భార్యగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది.

ఇక పోలీస్‌అధికారి ఎదుర్కొనే వృత్తిపరమైన, శారీరకపరమైన సమస్యలో భాగం పంచుకునే భార్యగా చాలా మంచి పాత్రను తనకిచ్చిన దర్శకుడు అరుణ్‌వైద్యనాథన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రాన్ని మహిళలను ఆదరించడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పింది. ఒక తమిళ అమ్మాయిగా నిపుణన్‌ చిత్రంతో కన్నడంలోనూ మంచి గుర్తింపు పొందడం ఆనందంగా ఉందని తెలిపింది. నిపుణన్‌ చిత్రం తనకు మరిన్ని అవకాశాలను అందిస్తుందనే నమ్మకం ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం దుల్కర్‌సల్మాన్‌కు జంటగా సోలో అనే చిత్రంలో నటిస్తున్నానని శ్రుతిహరిహరన్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement