సినిమా కథలు రాయాలంటే సాగర్ వస్తా.... | I like nagarjuna sagar, says movie writer Diamond Ratnam babu | Sakshi
Sakshi News home page

సినిమా కథలు రాయాలంటే సాగర్ వస్తా....

Published Mon, May 19 2014 11:30 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

సినిమా కథలు రాయాలంటే సాగర్ వస్తా.... - Sakshi

సినిమా కథలు రాయాలంటే సాగర్ వస్తా....

విజయపురి సౌత్ : నాగార్జునసాగర్ అందాలంటే తనకెంతో ఇష్టమని తాను సినిమాలకు రాసే కథలు, డైలాగులు ఇక్కడికే వచ్చి రాసుకుంటానని వర్థమాన సినిమా కథల రచయిత డైమండ్ రత్నంబాబు తెలిపారు. కటుంబ సభ్యులతో నాగార్జున సాగర్ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దిల్ రాజు బ్యానర్పై తీసిన 'పిల్లా నీవులేని జీవితం' సినిమా ఈ నెల 30న విడుదల కానుందని ఆ సినిమాకు కథలో పాటు డైలాగులు తానే రాసినట్లు తెలిపారు. ఈ చిత్రంలో చిరంజీవి మేనల్లుడు సాయిరామ్తేజ హీరో నటించినట్లు చెప్పారు. కల్యాణ్రాం హీరోగా తీసిన షేర్ సినిమా, సీమశాస్త్రి సినిమాకు కథలు తానే రాసినట్లు రత్నంబాబు తెలిపారు.

'సోలో' సినిమాకు డైలాగులు సాగర్లో కూర్చొని రాసినట్లు ఆయన వివరించారు. పాండవులు పాండవులు తుమ్మెద సినిమాకు కథతో పాటు డైలాగులు రాసినట్లు చెప్పారు. తన శ్రమను గుర్తించిన ప్రముఖ హీరో మోహన్ బాబు సినిమా ఆడియో ఫంక్షన్లో తనకు లక్ష నగదు ప్రోత్సాహకం ఇవ్వడం మరచిపోలేనన్నారు. ఇప్పటికీ 7 సినిమాలకు కథలు మరికొన్ని సినిమాలకు డైలాగులు రాసినట్లు వివరించారు. నాగార్జున సాగర్తో పాటు తాను ఇక్కడ నుంచి బాపట్లకు వెళ్లి సముద్ర సమీప రిసార్ట్లలో కూర్చోని కథలు, డైలాగులు రాసుకుంటానని రచయిత రత్నంబాబు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement