![All 11,000 trains, 8,500 stations to have CCTV surveillance - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/22/train-cctv.jpg.webp?itok=CL1iNje1)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రయాణీకులకు భద్రతతో కూడిన ప్రయాణానుభూతులను కల్పించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాయి. త్వరలోనే 11,000 రైళ్లు, 8500 రైల్వే స్టేషన్లలో దాదాపు 12 లక్షల సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే శాఖ కసరత్తు సాగిస్తోంది. 2018-19 రైల్వే బడ్జెట్‌లో దీనికోసం రూ 3000 కోట్లతో నిధి ఏర్పాటు కానుంది. రైల్వేల ప్రణాళిక ప్రకారం ప్రతి కోచ్‌లో ఎనిమిది సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.
రైల్వే స్టేషన్లలో ప్రవేశ ద్వారాల నుంచి అన్ని ప్రదేశాలను కవర్ చేసేలా నిఘా నేత్రాల పర్యవేక్షణ ఉండేలా ప్రణాళికలు రూపొందించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 395 స్టేషన్లు, 50 రైళ్లలో సీసీటీవీ వ్యవస్థ అందుబాటులో ఉంది. రాబోయే రెండేళ్లలో రాజధాని, శతాబ్ధి, దురంతో సహా అన్ని ఎక్స్‌ప్రెస్, ప్రీమియర్ రైళ్లలో ఆధునిక నిఘా వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు.
వివిధ మార్గాల ద్వారా ఈ కార్యక్రమానికి భారీగా నిధులు సమీకరించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు పెరుగుతున్న క్రమంలో రానున్న రైల్వే బడ్జెట్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment