
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వరంగల్ అర్బన్ జిల్లా న్యూ శాయంపేట యూపీహెచ్‌సీ పరిధిలోని దీన్‌దయాళ్ నగర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్ (హెల్త్‌కేర్ వర్కర్) గన్నారపు వనిత (45) ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో మృతి చెందింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి వనిత కొద్దిపాటి అనారోగ్యంగా ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న 45 ఏళ్ల మహిళా ఆరోగ్య కార్యకర్త ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై జిల్లా సైడ్ ఎఫెక్ట్స్ పర్యవేక్షణ కమిటీ నుంచి రాష్ట్ర సైడ్ ఎఫెక్ట్స్ కమిటీకి నివేదిక పంపాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలన అనంతరం ఆ నివేదికను కేంద్ర సైడ్ ఎఫెక్ట్స్ కమిటీకి పంపుతామన్నారు.
చదవండి: (వికటించిన వ్యాక్సిన్.. ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్!)
Comments
Please login to add a commentAdd a comment