సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బందిపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు శనివారం వరుస ట్వీట్లతో వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ కష్టకాలంలో మీరు మీ ఇంటికి, ఇష్టమైన వారికి దూరంగా ఉంటూ కరోనాతో యుద్దం చేస్తున్నారు. మమ్మల్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు నిస్వార్థంతో అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మా కోసం మీరు చేస్తున్న త్యాగం అర్థం చేసుకోగలం.
కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ముందుండి నిలిచి పోరాడుతున్న వైద్యసిబ్బందే మన సూపర్ హీరోలు. ఈ కష్ట కాలంలో వారిపై ప్రేమ, సానుభూతి చూపించడమే వారికి మనం ఇచ్చే గొప్ప బహుమతి. ఈ పోరాటవీరుల పట్ల మర్యాదపూర్వకంగా, దయతో మెలగాలని అందరినీ అభ్యర్థిస్తున్నా. వారికి గౌరవం ఇవ్వండి. అవిరామంగా పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంటివద్దనే ఉంటూ సురక్షితంగా ఉండండి’అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే కరోనా సమయంలో పోలీసు, పారిశుద్య కార్మికుల సేవలను కొనియాడుతూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.
I stand in gratitude for all health workers who are working selflessly and tirelessly to keep us safe and secure in these trying times. We must come to understand that they're doing this to safeguard us. 🙏🙏 pic.twitter.com/QG5AlXrMMo
— Mahesh Babu (@urstrulyMahesh) May 2, 2020
చదవండి:
మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!
అఘోరాగా బాలయ్య.. ఇది నిజమేనంటా
Comments
Please login to add a commentAdd a comment