
న్యూఢిల్లీ: కోవోవాక్స్ వ్యాక్సిన్ టీకా ఒక్కోడోసు ధరను రూ. 900 నుంచి రూ. 225కు తగ్గిస్తున్నట్లు సీరమ్ సంస్థ ప్రకటించింది. 12–17ఏళ్ల పిల్లలకు ప్రైవేట్ సెంటర్లలో ఇచ్చేందుకు సోమవారం కోవిన్ పోర్టల్‌లో ఈ టీకాను చేర్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే డోసు ధరను రూ. 225 ప్లస్ జీఎస్‌టీగా నిర్ధారించినట్లు కేంద్రానికి కంపెనీ తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రులు రూ. 150 వరకు సర్వీస్‌చార్జి వసూలు చేయవచ్చు. కోవిన్ పోర్టల్‌లో కూడా టీకా ధరను సవరించి పొందుపరిచారు. ప్రస్తుతం 12ఏళ్ల పైబడిన పిల్లలకు ఇండియాలో కోర్బెవాక్స్, కోవాగ్జిన్, కోవోవాక్స్ అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment