high school teacher in New York arrested after she vaccinated a pupil at home: కొంతమంది మంచిగా చదువుకుని కూడా తెలితక్కువగా ప్రవర్తిస్తున్నారని అనాలో లేక అన్ని తెలుసు అన్న గర్వంతో చేస్తున్నారో కూడా తెలియదు. అయితే ఇలాంటి పనుల వల్ల కొంతమంది అభాసుపాలైతే మరికొందరు కటకటాల పాలవుతున్నారు. అచ్చం అలానే ఒక ఉపాధ్యాయుడు చట్టపరమైన అనుమతి లేకుండా ఒక విద్యార్థికి కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాలపాలైంది.
(చదవండి: మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం... 13 మంది మృతి)
అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలోని లారా రస్సో అనే 57 ఏళ్ల సైన్స్ టీచర్ 17 ఏళ్ల అబ్బాయికి కోవిడ్ -19 వ్యాక్సిన్ వేసింది. నిజానికి కోవిడ్ వ్యాక్సిన్‌ను వ్యాక్సినేషన్ కేంద్రాలలో లేదా వైద్యా నిపుణుల సమక్షంలో వేయించుకోవాలి. ఈ మేరకు ఆ టీనేజర్ తల్లి ఈ విషయం తెలుసుకుని వెంటనే న్యూయార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే లారా రస్సో అనే బయోలజీ టీచర్‌ని అరెస్టు చేశారు.
అయితే ఆ టీచర్ తల్లిదండ్రుల అనుమతి కూడా లేకుండా ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిందని, పైగా ఆ వ్యాక్సిన్ ఆమెకు ఎక్కడ నుంచి లభించిందనేది కూడా విచారణలో తెలియాల్సి ఉందని పోలీస్ కమీషనర్, పాట్రిక్ రైడర్ పేర్కొన్నారు. దీంతో లారా రస్సో పనిచేస్తున్న హెరిక్స్ హైస్కూల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫినో సెలానో ఆ టీచర్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment