ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా కొన్నిరాష్ట్రాల్లో.. హెల్త్‌వర్కర్లు, ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కరోనా టీకా వేస్తున్నారు. అయితే, కొందరు కేటుగాళ్లు తాము.. వ్యాక్సినేషన్ ఉద్యోగులమని చెప్పి చోరీలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి సంఘటన యశ్వంత్‌పూరలో చోటుచేసుకుంది. మాతికేరేలోని ఒక అపార్ట్‌మెంట్‌లో విక్రమ్‌సింగ్ తన పిల్లలు, తల్లి పిస్తాదేవితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో.. నిన్న(నవంబరు 29)న కొందరు వ్యక్తుల ఆమె ఇంటిలోపలికి ప్రవేశించారు. తాము.. బృహత్ బెంగళూరు మహనగర పాలికె(బిబిఎంపీ) ఉద్యోగులమని చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో పిస్తాదేవి, మరో మహిళ మాత్రమే ఉన్నారు.
ఈ క్రమంలో వారు ఒక గన్‌తీసి వారిని బెదిరించి వారిని ఒక గదిలో బంధించారు. ఆ తర్వాత.. ఆమె బంగారు చైన్‌ను, గదిలో ఉన్న నగలను దోచేశారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, కొద్దిసేపటికి పిస్తాబాయి మనవళ్లకు టిఫిన్ బాక్సు తీసుకోవటానికి ఒక వ్యక్తి ఆమె ఇంటికి వచ్చాడు. పిస్తాబాయి.. ఎంత సేపటికి తలుపు తీయకపోవడంతో అతని కుమారుడికి సమాచారం అందించాడు.
అక్కడికి చేరుకున్న విక్రమ్‌సింగ్ ఇంటి వెనుక నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పుడు తన తల్లి పిస్తాబాయి,మరోమహిళ గదిలో బంధించబడి ఉండటాన్ని చూశాడు. ఆ తర్వాత.. పిస్తాబాయి జరిగిన ఉదంతాన్ని కుమారుడికి తెలియజేసింది. వెంటనే విక్రమ్‌సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment