న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఈ మధ్యే టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మార‍్చి నాటికి పూర్తికాగానే.. 12 నుంచి 14 ఏళ్ల వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్ ఎన్‌కే అరోరా తెలిపారు.
జనాభాలో 15-18 ఏళ్ల వాళ్లు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నారని వారిలో దాదాపు 3.45 కోట్ల మందికి పైగా కోవాక్సిన్ తొలి డోసును వేయించుకున్నారని తెలిపారు. కాగా తదుపరి డోసు 28 రోజుల్లో ఇస్తారని ఎన్టీఏజీఐ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం గతేడాది జనవరి 16న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలుత మొదటి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకి తర్వాత ఫ్రంట్‌లైన్ కార్మికులకు వేయడం జరిగింది. అలాగే గతేడాది మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడిన వారికి, ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల వారికి, మే 1 నుండి 18 ఏళ్లు పైబడినవారికి.. ఇలా దశాల వారికి వ్యాక్సిన్‌లు వేయడం ప్రారంభించింది.
అంతేకాదు ప్రభుత్వం కరోన కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది దగ్గర నుచి 60 ఏళ్లు పైబడిన వారందరి కోసం ముందుజాగ్రత్త చర్యగా ప్రికాషనరీ వ్యాక్సినేషన్‌ని ఈ నెల 10 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
(చదవండి: రైలు రావడం చూసి మరీ ఆమెను పట్టాలపై తోసేశాడు.. ఆపై ఏం జరిగిందో చూడండి)
Comments
Please login to add a commentAdd a comment